చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు.. మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత ఏడాది మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఒకే టోర్నీని వరుసగా మూడుసార్లు గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన పీవీ సింధు.. ఈ ఏడాది మకావు ఓపెన్ నుంచి వైదొలగింది. వచ్చే నెలలో దుబాయ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సరికొత్త ప్రణాళికలతో సిద్ధమయ్యేందుకే మకావు ఓపెన్ నుంచి పీవీ సింధు తప్పుకున్నట్లు తెలుస్తోంది.