సిమోనా హాలెప్ భారీ విరాళం.. 200 కరోనా కేసులు

శనివారం, 28 మార్చి 2020 (19:20 IST)
వింబుల్డన్ ఛాంపియన్, ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా ఫేస్‌బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్, కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది.
 
అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను సిమోనా కోరింది. రోమానియా ఇప్పటికే 200 కరోనా కేసులు నమోదైనాయి. మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలని, ధైర్యంగా ఉండాలని ఆమె చెప్పింది. మే2 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు వుండవని.. టెన్నిస్ టూర్లను కూడా రద్దు చేశారు. 
 
ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరాడుతున్న నేపథ్యంలో జపాన్ లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని అనేక సభ్య దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు