ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని విజయ దరహాసం చేసింది. ఇది సెరీనా విలియమ్స్‌కి 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. కాగా ఈ ఫైనల్లో సెరీనా విలియమ్స్, షరపోవాల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగుగా సెరీనా షరపోవా పైన 6-3, 7-6 (7-5) స్కోరుతో విజయం సాధించింది.