పెద్దప్రేగులోని కణితికి ఆపరేషన్ : ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:31 IST)
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగులోని కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించారు. దీంతో ఆయన్ను ఐసీయూలో ఉంచారు.
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. అలాగే, ఆయన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగానే పని చేస్తున్నట్టు వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, తన ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతున్నట్టు పీలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, మూడు ప్రపంచ కప్‌లు సాధించన ఏకైక ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు. గత 1958,1962, 1970 సంవత్సరాల్లో పీల్ బ్రెజిల్ దేశాన్ని ఫుట్‌బాల్ చాంపియన్‌గా నిలిపారు. అలాగే ఆ దేశం తరపున మొత్తం 92 మ్యాచ్‌లు ఆడిన పీలే.. 77 గోల్స్ చేశారు. పైగా, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ చేసిన ఏకైక ఆటగాడుగా పీలే నిలిచాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు