ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులోభాగంగా, పలు రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజనుల వ్యవహారాల, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ క్రీడాదినోత్సవమైన 2019, ఆగస్టు 29న ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ఆ మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు.
కేంద్ర క్రీడల శాఖ సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ స్కిప్పింగ్ ఆడి తన ఫిట్‌నెస్‌ను రుజువు చేసుకున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ తన ఫిట్నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. కాగా, మంత్రి చేసిన స్కిప్పంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.