శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉంటే..?

శుక్రవారం, 27 మార్చి 2015 (13:24 IST)
చైత్ర మాసం శుక్ల పక్షమినాడు రామచంద్రమూర్తి అవతరించారు. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముడిని షోడశోపచారములచే ఆరాధించి పురాణమును పఠించి, జాగరణ చేసి మరునాడు ఉదయం కాలకృత్యములు నేరవేర్చుకుని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రునిని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచాలి.
 
గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు దానము ఇచ్చి శ్రీరామచంద్రుడిని పూజించాలి. లేదా శక్తి తగ్గట్లు దానధర్మాలు చేయవచ్చు. ఇలా శ్రీరామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకములందు భోగమును, మోక్షమును కలిగించునది. 
 
కావున శుచిగా ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనమగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలే ఉత్తముడై రాణిస్తారని పండితులు అంటున్నారు. నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజ చేస్తే ముక్తి లభిస్తుంది. రామాలయాల్లో జరిగే కల్యాణోత్సవం, రామ రామ మంత్రము పఠించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

వెబ్దునియా పై చదవండి