ఇకపోతే.. భద్రాచలం రామాలయంలో ఆరు రకాల మూర్తులు ఉన్నాయి. ఇందులో కల్యాణమూర్తి ప్రత్యేకమైనది. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన రామలక్ష్మణ విగ్రహాలు, ఫణిగిరి నుంచి తెచ్చిన సీతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సీతారాముల వారికే శ్రీరామనవమి రోజున కల్యాణం చేస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది.
ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఏప్రిల్ 18న శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.