అతిథులకు నోరూరించే టేస్టీ ట్రీట్ ఎలా చేయాలో తెలుసా?

మంగళవారం, 4 డిశెంబరు 2012 (14:52 IST)
FILE
కావలసిన పదార్థాలు :
సీడ్ లెస్ ఖర్జూరం, బాదం, జీడిపప్పు, ఉప్పులేని పిస్తా పప్పు: అర కప్పు
పాల పౌడర్ : రెండు టీ స్పూన్లు
యాలకుల పొడి : చిటికెడు
రోజ్ ఎసెన్స్ : కాసింత
కోకోనట్ పౌడర్ : నాలుగు టేబుల్ స్పూన్లు
పాలు : రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
ముందుగా బాదం, పిస్తా, జీడిపప్పు తురుముకుని పక్కన బెట్టుకోవాలి. ఇందులో పాలు పౌడర్, ఏలకుల పొడి ఎసెన్స్ చేర్చుకోవాలి. తర్వాత సీడ్ లెస్ ఖర్జూరంలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. తదనంతరం పాలులో ఖర్జూరాన్ని ముంచి, కోకోనట్ పౌడర్‌లో వేసి ఈ స్వీట్‌ను గెస్ట్‌కు సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి