క్యారెట్ హల్వా

శనివారం, 4 ఆగస్టు 2007 (15:01 IST)
కావలసిన వస్తువులు :
క్యారెట్ : పావుకిలో
పంచదార : 200 గ్రా
నెయ్యి : అర్థపావుకిలో
జీడిపప్పు : 10 బద్దలు
కిస్‌మిస్‌ : కావలసినన్ని

ఇవి సిద్ధం చేసుకోండి:
కేరెట్‌ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి, వాటిలో కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాల సేపు ఉడకినివ్వండి. ఉడికిన కేరెట్‌ గడ్డల పైపొట్టును చేతితో తీసేసి, ఎండు కొబ్బరి కోరుతో కేరెట్‌ దుంపలను కోరుకోవాలి.

ఇలా చెయ్యండి :
ఒక దళసరి స్టీల్‌ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌‌లు వేసి వేగించండి. తరువాత కోరి ఉంచిన కేరెట్‌ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేదాక ఉడకనివ్వాలి. దించబోయే ముందు ఏలకులు పొడి చేసి వెయ్యాలి. ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ కేరెట్‌ హల్వా పళ్లెంలో వెయ్యాలి. ఆరకుండా ముక్కలు కోయాలి. దీంతో కేరెట్ హల్వా రెడీ.

వెబ్దునియా పై చదవండి