డ్రైఫ్రూట్స్‌తో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూకు నాలుగేసి చొప్పున డ్రై ఫ్రూట్స్ రోజూ రెండేసి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు చెబుతున్నారు. అలాంటి డ్రైఫ్రూట్‌తో పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దామా..
కావాల్సిన పదార్థాలు : బాస్మతి బియ్యం : ఒక కప్పు పాలు : ఐదుకప్పులు ఖర్జూర ముక్కలు : 50 గ్రాములు కిస్మస్ : 50 గ్రాములు బెల్లంతురుము : కప్పు నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తాపప్పులు నెయ్యి : టెబుల్ స్పూన్ యాలకులు : అరటీస్పూన్
తయారీ విధానం : కాచిన పాలను రైస్కుక్కర్లో పోసి, కడిగి బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. మధ్యలో రెండుసార్లు కలియబెట్టాలి. కొద్దిగా నెయ్యివేసి ఖర్జూర ముక్కలు వెయించాలి. వీటిని పొంగలి మూడొంతులు ఉడికాక కిస్మస్, బెల్లం కలపాలి. వేయించిన నట్స్, యాలకులపొడి కలిపి వేడిగా వడ్డించాలి.