కావలసిన పదార్థాలు : బియ్యం... పావు కేజీ సాదా బెల్లం లేదా తాటిబెల్లం... 400 గ్రా. నెయ్యి.. 150 గ్రా. చిక్కటి కొబ్బరిపాలు... ఒక గ్లాసు జీడిపప్పు... 50 గ్రా.
తయారీ విధానం : బియ్యం 3 గంటలు నానబెట్టి, చాలా మెత్తగా పలుచగా రుబ్బాలి. ఈ పిండిని వస్త్రంలో వడగడితే నీళ్లు పోయి చిక్కటి పేస్ట్ మిగులుతుంది. ఇప్పుడు బెల్లం తురుమును బాణలిలో వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ పాకంను ఇసుక లేకుండా వడగట్టాలి. తరువాత పాకాన్ని మళ్లీ బాణలిలో పోసి బాగా ముదురుపాకం వచ్చేవరకూ తిప్పుతూ ఉండాలి.
ఇప్పుడు బియ్యం పేస్ట్‌ను అందులో వేసి కలపాలి. చిక్కబడ్డ తరువాత నెయ్యి కొంచెంకొంచెంగా వేస్తూ కొబ్బరిపాలు పోస్తూ తిప్పుతూ ఉండాలి. ఇది బాగా చిక్కబడి హల్వాలా తయారవుతుంది. దించేముందు విడిగా నేతిలో వేయించిన జీడిపప్పు చల్లాలి. దీన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కోసుకోవచ్చు లేదా అలాగే తినవచ్చు. అంతే నల్ల హల్వా సిద్ధం..!