కావలసిన పదార్థాలు : అనాసపండు తురుము.. నాలుగు కప్పులు పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు పంచదార.. రెండు కప్పులు జీడిపప్పులు.. అరకప్పు బాదంపప్పు.. పావు కప్పు పిస్తా పప్పులు.. కాసిన్ని కోవా.. అర కప్పు ఎల్లో ఫుడ్ కలర్.. ఆరు చుక్కలు ఫైనాఫిల్ ఎసెన్స్.. ఆరు చుక్కలు నెయ్యి.. రెండు టీస్పూన్లు
తయారీ విధానం : ఒక పాత్రలో నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి పక్కనుంచాలి. అదే పాత్రలో అనాసపండు తురుము, కొబ్బరి తురుములను ఒకదాని తరువాత ఒకటి వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. దానికి పంచదారను కూడా జతచేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తరువాత కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత నేతిలో వేయించి జీడి, బాదం, పిస్తా పప్పులతో అందంగా అలంకరించి సర్వ్ చేస్తే సరి..! అంతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే అనాస హల్వా తయార్..!