ముసల్మానులకు ప్రీతిపాత్రం "గిల్‌ ఎ ఫిర్‌దౌస్‌"

IFM
కావలసిన పదార్థాలు :
సొరకాయ.. ఒకటి
పాలు.. ఒక లీ.
బియ్యంపిండి.. ఒక కప్పు
పంచదార.. 2 కప్పులు
యాలకుల పొడి.. ఒక టీ.

తయారీ విధానం :
సొరకాయ తొక్కు తీసి సన్నగా తురమాలి. తురుము మునిగేవరకూ నీళ్లు పోసి పది నిమిషాలు ఉంచాలి. ఆపై మరి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. పాలు, పంచదార కూడా వేసి కలుపుతూ కాసేపు ఉడికించాలి. సొరకాయ తురుము బాగా ఉడికిన తరువాత బియ్యప్పిండి వేసి తిప్పుతూ పది నిమిషాలు ఉడికించి దించాలి. యాలకులపొడి వేసి కలిపి, చల్లారాక కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. చివర్లో ఏదేని నట్స్‌తో అలంకరించి అతిథులకు చల్లచల్లగా అందించవచ్చు.

వెబ్దునియా పై చదవండి