కావలసిన పదార్థాలు : మైదాపిండి... పావు కేజీ నెయ్యి... 100 గ్రాములు కలర్ కోసం ఏదో ఒక రంగు... చిటెకెడు పంచదార... అరకిలో పాలు... ఒక కప్పు యాలకుల పొడి... అర టీస్పూను
తయారీ విధానం : మైదా పిండిని నూనె కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో డాల్డా లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో మందపాటి పూరీల్లా వత్తుకుని వేడయిన నూనెలో బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇంకోవైపున పంచదారలో తగినంత నీటిని పోసి అందులో యాలకుల పొడి, రంగు వేసి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేయించిన పూరీలను పాకంలో ముంచి తీసి ఆరబెట్టి ఆ తరువాత వడ్డించుకోవాలి. అంతే మైదాపిండి రసగుల్లా రెడీ.