కావలసిన పదార్థాలు : పొట్లకాయ.. చిన్నసైజుది బియ్యం.. రెండు టీ. కొబ్బరి తురుము.. మూడు టీ. పాలు.. అర లీ. పంచదార.. 200 గ్రా. జీడిపప్పు, ఎండుద్రాక్ష.. తగినన్ని యాలకులపొడి.. తగినంత
తయారీ విధానం : ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని, కొబ్బరి తురుమును కలిపి మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. పాలను బాగా మరిగించి అందులో పంచదార వేసి కలియబెట్టాలి. దీనికి రుబ్బి ఉంచుకున్న బియ్యం, కొబ్బరి మిశ్రమాన్ని, ఉడికించిన పొట్లకాయ ముక్కలను చేర్చి పది నిమిషాలపాటు సన్నటి సెగమీద ఉడికించాలి.
చివర్లో దించే ముందు వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల పొడి వేస్తే సరి.. అంతే వేడి వేడి పొట్లకాయ తిమ్మనం సిద్ధమైనట్లే..! పొట్లకాయ వాతాన్ని పోగొడుతుంది. పథ్యం తినేవారికి ఇది చాలా మంచిది. అంతేగాకుండా ఇది తేలికగా జీర్ణం అవుతుంది. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా వుంటుంది.