వెనిల్లా ఎసెన్స్‌తో కేక్‌ను తయారు చేయడం ఎలా?

శనివారం, 24 డిశెంబరు 2011 (19:08 IST)
FILE
కావలసిన పదార్థాలు:

పంచదార పొడి : 50గ్రా, గుడ్డు : 1, పాలు : 15 మి.లీ, వెన్న : 30గ్రా, మైదాపిండి : 50గ్రా, బేకింగ్ పౌడర్ : 1/4 చెంచా, వెనిల్లా ఎస్సెన్స్ : కొన్ని చుక్కలు, ఎండు ద్రాక్ష : 30గ్రాములు.

తయారి:

వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి ఎండు ద్రాక్ష చేర్చాలి. మైదాను కూడా కలిపి, పిండి జారుగా ఉండేందుకు కాసిని పాలు కలపాలి. ఇప్పుడు పిండిని పేపర్ కప్స్‌లో పోసి 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన కేక్ రెడీ.

వెబ్దునియా పై చదవండి