వేడిగా, చల్లగా.. ఎలాగైనా సరే.. "బాదం పాయసం"

FILE
కావలసిన పదార్థాలు :
నెయ్యి... నాలుగు టీ.
బాదం పప్పు.. 250 గ్రా.
పంచదార... 250 గ్రా.
పాలు... అర లీ.
యాలక్కాయలు, జీడిపప్పు, సారా పప్పు, పిస్తాపప్పు... తలా పది గ్రా.
కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ.

తయారీ విధానం :
బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి. తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సారా, పిస్తా పప్పులను కలుపుకోవాలి.

కలర్‌కోసం కేసరి పౌడర్, యాలక్కాయల పొడిని కూడా చేర్చుకోవాలి. అంతే వేడివేడి బాదం పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడిగానైనా తినవచ్చు లేదా చల్లగా తినాలకునేవారు ఇరవై నిముషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి