కావలసిన పదార్థాలు : బాదంపప్పులు... పావు కేజీ పంచదార... ఒక కప్పు పాలు... అర కప్పు యాలకుల పొడి... అర టీ. పచ్చ కర్పూరం... చిటికెడు నెయ్యి... ఒక కప్పు
తయారీ విధానం : బాదంపప్పు మునిగేలా నీళ్లు పోసి 4 గంటలు నాననివ్వాలి. తరువాత వాటి పైపొట్టు తీసేసి నీరు పారబోసి మిక్సీలో వేసి అరగ్లాసు పాలు పోసి మెత్తగా రుబ్బాలి. అందులోనే పంచదార కలిపి అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి సన్నని మంటమీద కలుపుతూ ఉడికించాలి.
అలా ఐదు నిమిషాలు ఉడికాక.. నెయ్యి, యాలకులపొడి, పచ్చకర్పూరం వేసి కలుపుతూనే ఉండాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కాస్త గరిటెతో తీసి చేతితో తాకి చూడాలి. చేతికి అంటకుండా ఉన్నట్లయితే హల్వా తయారైనట్లే..! దీనిని కిందికి దించి ఓ ప్లేటుకు నెయ్యిరాసి అందులో వేసి సమానంగా సర్దాలి. సగం చల్లారిన తరువాత చాకుకి బాగా నెయ్యి రాసి ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.