కావలసిన పదార్థాలు : చక్కెర.. నాలుగు కప్పులు పనీర్.. ఒక కప్పు పాలు.. ఒక లీ. కుంకుమపువ్వు.. కొద్దిగా యాలకుల పొడి.. పావు టీ.
తయారీ విధానం : ముందుగా కుంకుమ పువ్వును కాసిన్ని పాలలో నానబెట్టి ఉంచాలి. అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకుని అందులో ఒక లీటర్ పాలు, రెండు కప్పుల చక్కెర పోసి గట్టిబడేంతదాకా మరిగించాలి. దానికి యాలకుల పొడి కుంకుమపువ్వు కలిపిన పాలు చేర్చి బాగా కలిపి దించేయాలి.
ఇప్పుడు పనీర్‌ను చిదిమి వేళ్ల కొసలతో అప్పడాల మాదిరిగా చేసుకోవాలి. అంతకు ముందుగానే రెండు కప్పుల చక్కెరలో కాసిన్ని నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో పనీర్ అప్పడాలను వేసి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత వడ్డించేటప్పుడు రెండు పనీర్ అప్పడాలను కప్‌లో వేసి... పైన రెండు టీస్పూన్ల గట్టిబడిన పాల మిశ్రమాన్ని వేసి సర్వ్ చేయాలి. అంతే వెరైటీ కేసర్ రస్మలాయీ తయార్..!