దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హర్రర్-కామెడీ జోనర్ లో వుండబోతోంది. ఇటీవలే హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజాగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు.
ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సమాచారం మేరకు రితికా నాయక్, సత్య తదితరులు నటించిన సీన్స్ ఇటీవలే గోదావరి జిల్లా షెడ్యూల్ లో చిత్రీకరించినట్లు తెలిసింది.