ఆహా... అటుకుల పాయసం ఎంత టేస్టో?

సోమవారం, 20 జనవరి 2020 (21:45 IST)
అటుకుల పాయసం చాలా టేస్టీగా వుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
 
కావలసినవి
అటుకులు - ఓ కప్పు
పాలు - రెండు కప్పులు
బెల్లం - అర కప్పు
జీడి పప్పు - నాలుగు పలుకులు
కొబ్బరి పొడి - రెండు స్పూన్లు
యాలకుల పొడి - అర టీ స్పూన్
నెయ్యి - రెండు టీ స్పూన్లు
 
తయారీ
అటుకులను నీళ్లలో వేసి ఓ నిమిషం తర్వాత నీళ్లు తీసేయాలి. నీళ్లు ఇంకా వున్నట్లయితే అటుకులను పండి నీళ్లు తీసేయాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడయ్యాక జీడిపప్పు వేసి వేగించాలి.
 
కొబ్బరి పొడి కూడా వేసి వేగించాలి. తరువాత పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత అటుకులు వేయాలి. చివరగా యాలుకల పొడి వేసి దింపుకోవాలి. వేడివేడిగా తింటే అటుకుల పాయసం చాలా రుచిగా వుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు