కాజు బర్ఫీ ఎలా తయారు చేయాలి!?

గురువారం, 12 ఏప్రియల్ 2012 (15:21 IST)
FILE
కావలసిన పదార్థాలు :

జీడిపప్పు - పావు కేజీ,
పంచదార - 200 గ్రా,
నెయ్యి - 50 గ్రా,

తయారీ విధానం :

జీడిపప్పులను తగినంత నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (అవసరమను కుంటే కొద్దిగా నీరు పోయవచ్చు). ఒక పెద్ద బాణలిలో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టౌమీద ఉంచి సన్నని సెగమీద బాగా ఉడికేవరకు కలుపుతూ వుండాలి. చివరగా నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి.

ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమంగా పరుచుకునేలా చేయాలి. కొద్దిగా చల్లారాక మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. రెండు గంటలు సమయం పూర్తిగా ఆరిన తరవాత కట్ చేసిన ముక్కలను తీసి తినచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కాజు బర్ఫీని ఏదైన డబ్బాలో వేసి నిల్వవుంచుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి