కాజూ బైట్స్

FILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పులు... రెండు కప్పులు
పిస్తా తరుగు... అర కప్పు
సోంపాపిడి... ఒక కప్పు
పంచదార... రెండు కప్పులు
నెయ్యి.... నాలుగు టీ.

తయారీ విధానం :
జీడిపప్పులలో ముప్పావు వంతువాటిని పొడిచేసి పక్కనుంచాలి. మిగిలిన పావువంతు జీడిపప్పులను సన్నగా తరిగి ఉంచాలి. పంచదారను గట్టిగా పాకంపట్టి ఆరబెట్టాలి. గట్టినపడిన పాకాన్ని మెత్తటి పొడిలాగా తయారు చేయాలి. బాణలిలో పాకంపొడి, జీడిపప్పు పొడి వేసి సన్నటి మంటమీద కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గరపడేముందుగా నెయ్యి, సోంపాపిడి కూడా వేసి మిశ్రమం అంతటినీ బాగా కలుపుతూ ఉండాలి.

చివరగా తరిగి ఉంచిన పిస్తా, బాదంపప్పులను కూడా కలిపి మిశ్రమం గట్టిపడగానే స్టౌ మీది నుంచి దించేయాలి. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా సర్ది చల్లారిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే మూడు నెలలదాకా నిల్వ ఉండే కాజూ బైట్స్ తయారైనట్లే...!!

వెబ్దునియా పై చదవండి