కిడ్స్ ఫేవరేట్ ఫుడ్ "బటర్ బర్ఫీ"

కావలసిన పదార్థాలు :
బటర్.. మూడు కేజీలు
చక్కెర.. 2 కేజీలు
అమూల్ మిల్క్ పౌడర్.. ఒక కేజీ
గ్లూకోజ్ పౌడర్.. వంద గ్రా.
ఐస్‌క్రీం పౌడర్.. ఒక టీ.
మైదా.. వంద గ్రా.

తయారు చేసే విధానం:
ఒక పాత్రలో బటర్, మిల్క్ పౌడర్, మైదాలను వేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఒక గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి బటర్, మైదా మిశ్రమాన్ని... ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్‌లను వరుసగా వేసి బాగా కలియబెట్టాలి. ఒక ట్రేను తీసుకుని అడుగున నెయ్యిని పూసి ఉడుకుతున్న మిశ్రమాన్ని అందులో పోసి ఆరబెట్టాలి.

ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ బర్ఫీ తయారైనట్లే..! చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ స్వీటు తయారు చేయటం కూడా తేలికే కాబట్టి మీరూ ఓసారి ట్రై చేసి చూస్తారు కదూ..?!

వెబ్దునియా పై చదవండి