చర్మాన్ని మిలమిలా మెరిపించే "క్యారెట్ హల్వా"

FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు‌.. పావు కేజీ
పంచదార.. 200 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
జీడిపప్పు.. 10
కిస్‌మిస్‌.. కావలసినన్ని

తయారీ విధానం :
ఒక స్టీల్‌ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌‌లు వేసి వేయించాలి. తరువాత తురిమి ఉంచిన క్యారెట్ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. దించబోయే దాంట్లో ముందు యాలకులు పొడి చేసి వెయ్యాలి.

ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆపై అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి. అంతే క్యారెట్ హల్వా తయారైనట్లే..! ప్రతిరోజు క్యారెట్ రసం సేవిస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. క్యారెట్ చర్మ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని తేమను కూడా పెంచుతుంది.

వెబ్దునియా పై చదవండి