జీర్ణశక్తిని వృద్ధి చేసే "క్యారట్ ఖీర్"..!

FILE
కావలసిన పదార్థాలు :
క్యారట్ తురుము.. ఒక కప్పు
పాలు.. అర లీ.
నెయ్యి.. రెండు టీ.
కోవా.. వంద గ్రా.
పంచదార.. ఒక కప్పు
డ్రైఫ్రూట్స్.. 25 గ్రా.
యాలకుల పొడి.. అర టీ.

తయారీ విధానం :
పాన్‌లో ముందుగా ఒక టీస్పూన్ నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి క్యారెట్ తురుమును దోరగా వేయించి పక్కనుంచాలి. ఈలోపు మరో స్టవ్‌పై పాలను ఓ పాత్రలో పెట్టి బాగా మరగనివ్వాలి. పాలు మరుగుతుండగా కోవా వేసి కలుపుతుండాలి.

పది నిమిషాలు అలా ఉడికిన తరువాత.. వేయించి ఉంచుకున్న క్యారట్ తురుమును, పంచదారను వేసి బాగా కలియబెట్టి మరో పది నిమిషాలపాటు ఉడికించాలి. మిశ్రమం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. దించేముందు వేయించిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి. అంతే వేడి వేడి క్యారట్ ఖీర్ తయారైనట్లే..!

వెబ్దునియా పై చదవండి