జూనియర్స్‌కు "బీట్‌రూట్ కేరట్ కజ్జికాయలు"

FILE
కావలసిన పదార్థాలు :
కేరెట్ తురుము.. ఒక కప్పు
బీట్‌రూట్ తురుము.. 2 కప్పులు
మైదాపిండి.. 350 గ్రా.
వేయించిన జీడిపప్పు.. పది
బాదంపప్పు.. పది
కొబ్బరి తురుము.. రెండు కప్పులు
నెయ్యి.. 50 గ్రా.
నూనె.. పావు కేజీ
పంచదారపొడి.. రెండు కప్పులు
యాలకులపొడి.. అర టీ.
నీళ్లు.. ఒకటిన్నర కప్పు

తయారీ విధానం :
మైదాపిండికి నెయ్యి, గోరువెచ్చని నీరు జతచేస్తూ మృదువుగా పూరీల పిండిలాగా కలుపుకుని.. నిమ్మకాయం ఉండలు చేసి, మూతపెట్టి పక్కనుంచుకోవాలి. కడాయిలో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి, కొబ్బరి తురుము, బీట్‌రూట్, కేరట్ తురుములను విడి విడిగా పచ్చిదనం పోయేంతదాకా వేయించాలి.

వేయించిన తురుములను ఒక పాత్రలోకి తీసుకుని పంచదార, బాదం, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడిలను జతచేస్తూ బాగా కలుపుకోవాలి. మైదాపిండిని పూరీల్లాగా వత్తుకుని మధ్యలో ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి కజ్జికాయల్లాగా వత్తుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి. కేరట్, బీట్‌రూట్‌లను విడిగా తినని పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు, పైగా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా..!

వెబ్దునియా పై చదవండి