కావలసిన పదార్థాలు : వాల్ నట్స్ : ఒక కప్పు పంచదార : అరకప్పు నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు రవ్వ : టేబుల్ స్పూన్ యాలకుల పొడి : అర టీ స్పూన్ పాలు : కప్పు అలంకరణకు పావు కప్పు తరిగిన అక్రోట్స్ పప్పులు.
తయారీ విధానం : ముందుగా పంచదార, అరకప్పు నీరు కలిపి వేడిచేయాలి. ఈలోగా నాన్‌స్టిక్ మూకుడులో నెయ్యి వేడి చేసి, సన్నని సెగపై రవ్వ వేయించాలి. రవ్వ, వాల్‌నట్స్ చిదిమి పంచదార పాకంలోవేసి సన్నని సెగపై కలియబెడుతూ ఉడికించాలి. బంగారు రంగులోకి మారే వరకు అంటే 15 నిమిషాల పాటు ఉంచాలి. మిశ్రమం డ్రైగా అయ్యాక పాలుపోసి కలపాలి. సన్నని సెగపై మరో పదినిమిషాలు ఉడికించాలి. దీనికి యాలకుల పొడివేసి మాడిపోకుండా కలియబెట్టాలి. తర్వాత అక్రోట్ పప్పులను వేసి అలంకరిస్తే.. వాల్ నట్స్ హల్వా రెడీ.. ఈ హల్వాను మీ గెస్ట్‌లకు హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.