కావలసిన పదార్ధాలు : చిక్కటి పాలు : ఒక లీటలు చక్కెర : 500 గ్రాములు మైదా : 1/4 కప్పు రవ్వ : 1/4 కప్పు నెయ్యి : 300 మిల్లీ నీరు : తగినన్ని
తయారీ విధానం : మొదట బాణలిలో రవ్వను వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. మరో వైపు చక్కెరలో నీళ్ళు పోసి తీగపాకం చేసి ఉంచుకోవాలి. అంతేకాకుండా పాలను చిక్కబడేవరకు మరిగించి ఉంచుకోవాలి. తరువాత ఒక పాత్రలో పాలు పోసి అందులో మైదా, రవ్వ కలిపి ఉడికించాలి. ఆ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అది గరిటజారుగా ఉండాలి. తరువాత వెడల్పాటి బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంతో చిన్న సైజు దోసెల్లాగా చేసి రెండువైపులా ఎర్రగా కాల్చి చక్కెర పాకంలో వేసి నానిన తర్వాత తీసి పళ్ళెంలో సర్దుకోవాలి. అంతే తీయ్యటి పనియారం రెడీ...