కావలసిన పదార్థాలు : బాదంపప్పులు.. అర కేజీ నెయ్యి.. 300 గ్రా. పంచదార.. 400 గ్రా. నీళ్లు.. సరిపడా యాలకుల పొడి.. చిటికెడు జీలకర్ర.. ఒక టీ. ఉప్పు.. తగినంత
తయారు చేసే విధానం: బాదంపప్పును ఉడికించి చల్లారాక పొట్టును తీసేయాలి. వీటికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా చేయాలి. తర్వాత బాణలిలో నెయ్యి కరిగించి ఈ బాదంపప్పు ముద్ద వేసి లేతబంగారు వర్ణం వచ్చేవరకు సన్నటి సెగపై వేయించాలి. ఇప్పుడు మరో బాణలిలో కొద్దిగా నీరు పోసి పంచదార ఉండపాకం పట్టాలి.
ఈ పాకానికి ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బాదంపేస్టు, యాలకుల పొడి, జీలకర్ర, తగినంత ఉప్పు చేర్చి బాగా కలపాలి. సన్నని సెగపై ఉడికిస్తూ.. మిశ్రమం దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేటులో పోసి చల్లారిన తర్వాత ముక్కల్లా కోసుకోవాలి. అంతే నోరూరించే బాదంపాక్ రెడీ...! బాదంపప్పును ప్రతిరోజూ ఆహారంలో తీసుకున్నట్లయితే శరీరంలో శక్తిని నింపుతుంది. దీర్ఘాయుష్షును పెంచే గుణాలు దీంట్లో మెండుగా ఉన్నాయి కూడా..!