కావలసిన పదార్థాలు : రెడీమేడ్ రసగుల్లాలు... 25 (మార్కెట్లో దొరుకుతాయి) వెనీలా ఐస్‌క్రీమ్.. మూడు కప్పులు మేరీ బిస్కెట్లు... 12 స్ట్రాబెర్రీ గుజ్జు.. అర కప్పు
తయారీ విధానం : రసగుల్లాలను సిరప్ నుంచి పిండి సర్వ్ చేసే బౌల్లో సర్దాలి. వెనీలా ఐస్‌క్రీమ్‌ను కరిగించి రసగుల్లాలపై పోసి.. ఆపై స్ట్రాబెర్రీ గుజ్జు, మేరీ బిస్కెట్ల పొడితో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే మ్యాజిక్ రసగుల్లా తయార్..! చాలా సులభంగా తయారయ్యే ఈ రసగుల్లా రుచి కూడా వెరైటీగా, అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!!