పండుగవేళ తీపి రుచి "గోధుమ రవ్వ పాయసం"

FILE
కావలసిన పదార్థాలు :
గోధుమరవ్వ... పావు కప్పు
వెన్నతీయని పాలు.. అర కప్పు
మిల్క్‌మెయిడ్.. అర కప్పు
నెయ్యి.. అర టీ.
యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్.. తగినన్ని

తయారీ విధానం :
బాణలిలో నెయ్యి వేసి రవ్వను వేయించాలి. స్టవ్ ఆపకుండానే రవ్వలోనే కొద్దిగా నీరుపోసి ఉడికించాలి. ఐదు నిమిషాలు అలా ఉడికించిన తరువాత పాలు, మిల్క్‌మెయిడ్ వేసి కలియదిప్పుతూ మరిగించాలి. రవ్వ ఉడికిన తరువాత దించేందుకు ముందుగా యాలకులపొడి, కుంకుమపువ్వు, డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి కలిపితే వేడి వేడి గోధుమరవ్వ పాయసం సిద్ధమైనట్లే..! పండుగ పూట వెరైటీగా ఉండే ఈ గోధుమరవ్వ పాయసాన్ని మీరూ చేస్తారు కదూ..!

వెబ్దునియా పై చదవండి