కావలసిన పదార్థాలు : పాలు.. ఒక లీ. పంచదార.. రెండు కప్పులు పచ్చికోవా.. 50 గ్రా. కుంకుమపువ్వు.. చిటికెడు
తయారు చేసే విధానం : ముందుగా పాలను బాగా కాచి.. అందులో రెండు నిమ్మ చుక్కల రసం పిండి పాలను విరగ్గొట్టాలి. తరువాత ఒక సన్నటి క్లాత్లో పాల మిశ్రమాన్ని పోసి మూతి బిగగట్టి వేలాడ దీయాలి. నీళ్లన్ని పోయి గట్టి ముద్ద మిగులుతుంది. దాంట్లో పచ్చికోవాను వేసి మెత్తగా కలిపి ఉండలుగా చేసి.. గారెల్లాగా వత్తుకోవాలి.
ఈలోగా.. పంచదారను లేతపాకం పట్టి ఉంచాలి. ఉడుకుతున్న పాకంలో పైన తయారు చేసిన ఉండలను వేసి సన్నటి మంటమీద ఉడికించాలి. ఇవి ఉడికేలోగానే.. వేరే గిన్నెలో పాలుపోసి దాంట్లో సగం కప్పు పంచదార, చిటికెడు కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి చిక్కబడేంతదాకా మరిగించాలి. ఆపై పాకంలో ఉడికించిన ఉండలను కోవా మిశ్రమంలో కలిపి చల్లారబెట్టి, ఫ్రిజ్లో ఉంచి.. చల్లబడిన తరువాత తీసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన రసమలై సిద్ధం..!