కావలసిన పదార్థాలు : కొబ్బరికాయ.. అర చిప్ప పంచదార.. 200 గ్రా. పాలు.. ఒకటిన్నర లీ. మైదా.. వంద గ్రా. బొంబాయి రవ్వ.. అర కప్పు పంచదార.. ఒక టీ. నెయ్యి.. తగినంత బాదంపప్పు.. ఒక టీ. పిస్తా.. ఒక టీ. యాలకుల పొడి.. అర టీ.
తయారీ విధానం : మందపాటి బాణలి తీసుకుని వేడి చేసి, అందులో లీటరు పాలు పోసి వంద గ్రాముల పంచదార కూడా వేసి బాగా మరిగించాలి. పాలు సగమయ్యేదాకా మరిగించి, దించి చల్లార్చాలి. ఇప్పుడు విడిగా మరో బాణలి తీసుకుని అందులో కొబ్బరి తురుము, మిగిలిన పాలు పోసి చిక్కబడేవరకూ ఉడికించి, మిగిలిన పంచదార వేసి కలియబెట్టి, ఉడికాక దించి చల్లారనివ్వాలి.
మైదాలో రవ్వ, ఒక టీస్పూన్ పంచదార, మరో టీస్పూన్ నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలపాలి. దీన్ని చిన్న ముద్దల్లా తీసుకుని పలుచని చపాతీల్లా వత్తాలి. తరువాత అందులో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి మడవాలి. వీటిని పెనంమీద వేసి రెండువైపులా నెయ్యితో కాల్చి తీయాలి. చివరగా వేయించిన వాటిని ఓ డిష్‌లో పెట్టి, పైన తయారు చేసిన పాలమిశ్రమాన్ని పోసి..బాదం, పిస్తాలతో అలంకరించి వడ్డిస్తే సరి...!