దీపావళి పండుగకు తయారు చేసే స్వీట్లలో బాద్‌షా ఒకటి. అలాంటి బాద్‌షాను ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం. బాద్‌షా తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే...
మైదా : అరకేజీ డాల్డా : 200 గ్రాములు తినే సోడా : అర టీ స్పూన్ రిఫైండ్‌ఆయిల్ : తయారీకి సరిపడినంత చక్కెర : ఒక కేజీ యాలుకల పొడి : ఒక టీ స్పూన్ నెయ్యి : పది గ్రాములు నీరు : అర లీటరు తయారు చేసే విధానం...
ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలకు తగినన్ని నీళ్లు కలిపి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి చిన్నపాటి గుంట ఉండేలా నొక్కి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలోని నూనెను దోరగా వేయించి పెట్టుకోవాలి.
పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాద్‌షాలు వేయాలి. పాకంలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.