కావలసిన పదార్థాలు : బ్రెడ్ స్లైసులు.. పది పాలు.. అర లీ. క్రీమ్.. అర కప్పు పంచదార.. ఒక కప్పు మంచినీరు.. అర కప్పు రోజ్ వాటర్.. రెండు టీ. కుంకుమపువ్వు.. చిటికెడు బాదం.. పది పిస్తా.. పది నెయ్యి.. అర కప్పు
తయారీ విధానం : బ్రెడ్‌ముక్కల అంచులు తీసేసి త్రికోణాకారంలో కోయాలి. నాన్‌స్టిక్ బాణలి తీసుకుని బ్రెడ్ ముక్కలు పరచి నెయ్యి వేస్తూ బంగారు వర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా వేయించి తీసేయాలి. పాలల్లో క్రీమ్ వేసి సగమయ్యేవరకూ మరిగించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి. ఈ పాకాన్ని కూడా పాలల్లో వేసి కలపాలి.
నానబెట్టిన కుంకుమపువ్వు, రోజ్‌వాటర్, సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కల్ని అందులోనే కలపాలి. ఇప్పుడు వెడల్పాటి బాణలి తీసుకుని అందులో బ్రెడ్ ముక్కలు పెట్టి ఈ పాలమిశ్రమాన్ని పోసి సిమ్‌లో ఉంచాలి. పాకం ఆవిరయ్యేవరకూ ఉంచి తీసేయాలి. అంతే బ్రెడ్ మిఠాయి తయారైనట్లే..!!