మీ స్వీట్ కిడ్స్ కోసం "షక్కర్‌పారె"

FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... అర కేజీ
పంచదార... అర కేజీ
నెయ్యి... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
మైదాపిండిని తగినంత నీటితో చపాతీల పిండిలాగా కలిపి, అరగంటసేపు నానబెట్టాలి. ఒక పెద్ద పాత్రలో చక్కెర వేసి అర గ్లాసు నీరుపోసి మరగపెట్టి సిరప్ తయారు చేసుకోవాలి. పిండిని కొంచెం మందపాటి చపాతీల్లాగా రుద్ది, చాకుతో డైమండ్ ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి.

బాణలిలో నెయ్యి పోసి, బాగా కాగుతుండగా మైదా డైమండ్‌లను వేసి దోరగా వేయించి తీసి, మరుగుతున్న చక్కెర పాకంలో వేయాలి. రెండు లేదా మూడు నిమిషాలపాటు వాటిని పాకంలో అలాగే ఉండనిచ్చి, తరువాత తీసివేసి ఆరబెట్టాలి. అంతే షక్కర్‌పారె సిద్ధమైనట్లే...! వారం రోజులదాకా తాజాగా ఉండే వీటిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి