యాలకుల సువాసనలతో "కొబ్బరి అరిసెలు"

FILE
కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
కొబ్బరి తురుము.. రెండు కప్పులు
యాలకుల పొడి.. రెండు టీ.
నెయ్యి.. ఒక కప్పు
నూనె.. సరిపడా

తయారీ విధానం :
మైదా పిండిలో నాలుగు టీస్పూన్ల పంచదార కలిపి పూరీల పిండిలా కలిపి అరగంటసేపు నానబెట్టుకోవాలి. యాలకుల పొడితోపాటు మిగిలిన పంచదారను పౌడర్‌గా చేసి, కొబ్బరి తురుములో కలుపుకోవాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీల్లాగా వత్తాలి. వీటిపై నెయ్యిరాసి నాలుగు టీస్పూన్ల కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి చుట్టూ మూసేయాలి. పైన కాస్త నెయ్యి లేదా పొడి పిండి చల్లుతూ మల్లీ గుండ్రంగా అరిసెల్లాగా వత్తాలి. మొత్తం పిండినంతా అలా చేసుకుని ఉంచాలి.

ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా మరుగుతుండగా వత్తి ఉంచుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి, తీసి న్యూస్ పేపర్‌పై వేయయాలి. కాస్త ఆరిన తరువాత తీసి సర్వింగ్ డిష్‌లో ఉంచి, సర్వ్ చేయాలి. అంతే యాలకుల సువాసునతో అలరించే రుచికరమైన చక్కెర అరిసెలు తయార్..! వేసవి సెలవుల్లో చిన్నపిల్లలకు మంచి స్నాక్స్‌గా ఉపయోగపడే ఈ అరిసెలను తయారు చేయటం కూడా తేలికే.. మరి మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!!

వెబ్దునియా పై చదవండి