షుగర్ ఫ్రీ డ్రైఫ్రూట్స్ బర్ఫీ

FILE
కావలసిన పదార్థాలు :
అంజీర్... ఒక కప్పు
పిస్తా... అర కప్పు
బాదం... అర కప్పు
వాల్‌నట్స్... అర కప్పు
నెయ్యి... ఎనిమిది టీ.
షుగర్ ఫ్రీ పౌడర్... ఒక కప్పు

తయారీ విధానం :
అంజీర్, పిస్తా, బాదం, వాల్‌నట్స్‌లను సన్నటి ముక్కలుగా తరగాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి, డ్రైఫ్రూట్స్ ముక్కలను వేయించాలి. ముక్కలు వేగిన తరువాత షుగర్ ఫ్రీ పౌడర్‌ను అందులో కలిపి స్టౌ మీదినుంచి దించేయాలి. వేడి చేయటంవల్ల పంచదార పొడి కరిగి డ్రైఫ్రూట్స్‌తో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదేని ప్లేట్‌కు కాస్తంత నూనె రాసి దాంట్లో పోసి సమంగా చేసి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. గార్నిషింగ్ కోసం సిల్వర్ పేపర్‌ను పైన అద్దితే సరి...!

ఇంకేముంది పండుగకు అందరూ స్వీట్స్ తింటుంటే, ఈ మాయదారి చక్కెరవ్యాధివల్ల తీపి అనేదే ముట్టలేకపోతున్నానే...? అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా పైన చెప్పిన షుగర్ ఫ్రీ డ్రైఫ్రూట్స్ బర్ఫీలను తయారు చేసుకుని హాంఫట్ చేసేయండి మరి...!

వెబ్దునియా పై చదవండి