సేమియా లడ్డు తయారు చేసేదెలా!!

గురువారం, 29 మార్చి 2012 (17:10 IST)
FILE
కావల్సిన పదార్థాలు:

సేమియా - అరకేజీ,
పంచదార - మూడొందల గ్రాములు,
పాలు - అర లీటరు,
నెయ్యి - తగినంత,
జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావు కప్పు.

తయారు చేసే విధానం:

బాణలిలో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టాలి. కరిగాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత సేమియా వేసి గోధుమ రంగులోని వచ్చేదాక వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు మందపాటి గిన్నెలో మరికొద్దిగా నెయ్యి వేసి సేమియా పొడి, పంచదార కలపాలి. కొద్ది సేపయ్యాక పాలు పోసి బాగా కలపాలి. పంచదార కరిగాక మిశ్రమం బాగా ఉడుకుతుంది. కొద్దిసేపయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి దించేయాలి.

నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని పక్కనపెట్టాలి. తరువాత చేత్తో నచ్చిన పరిమాణంలో ఉండలు చేసుకొంటే తియ్యని, నోరూరించే సేమియా లడ్డు తయారయినట్టే.

వెబ్దునియా పై చదవండి