స్ట్రాబెర్రీల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టే ఈ స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్‌లలో ఒకటైన స్ట్రాబెర్రీని బ్యాడ్ కొలెస్ట్రాల్ శరీరంలో చేరనివ్వదు. ఇంకా స్ట్రాబెర్రీల్లో బి2, బి5, బి6 విటమిన్ కె. కాపర్, మేగ్నిషియం స్ట్రాబెర్రీల్లో ఉన్నాయి.
శరీరానికి ఎంతో మేలు చేసే స్ట్రాబెర్రీతో డిలైట్ ఎలా తయారు చేయాలో చూద్దామా..
కావలసిన పదార్థాలు : స్ట్రాబెర్రీలు - గుప్పెడు (నిలువుగా రెండుముక్కల్లా కోసుకోవాలి). ప్లెయిన్ కేక్ - ఒకటి. వెనీలా ఐస్‌క్రీం - 500 గ్రాములు. జిలిటెన్ - రెండు టీ స్పూన్లు ( గోరువెచ్చని నీటిలో కలపాలి). పాలు - చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి).
తయారీ విధానం: ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసిన స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్, పాలు, జిలిటెన్, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. అప్పుడు ఈ మిశ్రమాన్ని పోసి దానిపై మిగిలిన స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించి సర్వ్ చేస్తే స్ట్రాబెర్రీ డిలైట్ రెడీ..