హెల్తీ అండ్ టేస్టీ టమోటా హల్వా తయారీ ఎలా?

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:28 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
ఎర్రగా పండిన టమోటాలు.. పది
పంచదార.. రెండు కప్పులు
నెయ్యి.. ఒక కప్పు
జీడిపప్పు, బాదంపప్పు.. రెండూ కలిపి అర కప్పు
బొంబాయి రవ్వ.. ఒక కప్పు
యాలకుల పొడి.. రెండు టీ.

తయారీ విధానం :
ముందుగా టమోటా పండ్లను ఉడికించి గుజ్జు తీయాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. ఆ తర్వాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి. ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి. చివర్లో యాలకుల పొడి చల్లితే రుచికరమైన టమోటా హల్వా సిద్ధమైనట్లే.

వెబ్దునియా పై చదవండి