14,711కు చేరుకున్న స్వైన్ ఫ్లూ మృతులు

శనివారం, 30 జనవరి 2010 (13:06 IST)
ప్రపంచాన్ని గడగగడలాడించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 14,711కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

అదే ఓ వారం క్రితం 14142 మంది మృతి చెందినట్లు తమకు లెక్కలు అందాయని, అదే ఒక వారంలో 569 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. స్వైన్ ‌ఫ్లూ హెచ్1 ఎన్1 వైరస్ ప్రపంచంలోని ఉత్తర ధృవంలో పూర్తిగా వ్యాపించిందని, ముఖ్యంగా అక్టోబరు, నవంబరు నెలల మధ్యలో మరీ ఎక్కువగా ఈ వ్యాధి కారక క్రిములు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

జనవరి 24, 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగానున్న దాదాపు 209 దేశాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,711కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.

ఉత్తర ఆఫ్రికాలో ఈ వ్యాధి కారక క్రిములు మరింతగా విస్తరిస్తున్నాయని, ప్రధానంగా మోరోక్కో, అల్జీరియా, లిబియా, ఈజిప్టు ప్రాంతాల్లో వ్యాధి ప్రబలుతోందని డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం డిసెంబరు, ప్రస్తుత సంవత్సరం జనవరి నెలలో మరింతగా విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి