స్వైన్ ఫ్లూను అదుపు చేయండి: ఆజాద్

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. ఇప్పటికే వందమంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందారు. మరో పదిహేనుమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయా వైద్యాలయాల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ అదుపుకు తీసుకోవలసిన చర్యపై కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి అధికారులతో చర్చించారు.

ఇదిలావుండగా కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఒక్కరు చొప్పున ఈ వ్యాధిబారిని పడి మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖకు సంబంధించిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సోమవారం నాటికి దేశంలో ఈ వ్యాధి బారిన పడినవారి సంఖ్య సుమారు 4 వేలకు చేరుకుంది. మంగళవారం మరో వంద కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడింటారు.

వెబ్దునియా పై చదవండి