ధైర్యంగా ఆడండి: సహచరులకు సంగక్కర సూచన

ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ధైర్యంగా ఆడాలని సహచరులకు శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార సంగక్కర పిలుపునిచ్చాడు. మానసిక బలాన్ని, నైతిక ధైర్యాన్ని ప్రదర్శించాలని కోరాడు. శ్రీలంక క్రికెట్ జట్టుపై మూడు నెలల క్రితం పాకిస్థాన్‌లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు క్రికెటర్లు గాయపడ్డారు.

అనంతరం శ్రీలంక జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కుమార సంగక్కర మాట్లాడుతూ.. లాహోర్ దాడిని గుర్తు చేసుకున్నాడు. ఎక్కడా వంద శాతం గ్యారెంటీ ఉండదు. జీవితం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ఆడుతున్న జట్లన్నీ తామున్న పరిస్థితిలో లేవు. కొన్ని దేశాల్లో భద్రత సమస్యగా మారింది. అయితే వీటన్నింటినీ పక్కనబెట్టి ధైర్యంగా క్రికెట్ ఆడటంపై దృష్టి పెట్టాలని సంగక్కర సహచరులకు సూచించాడు.

వెబ్దునియా పై చదవండి