తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం వుందా?

శనివారం, 2 డిశెంబరు 2023 (12:02 IST)
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కాబోతున్నాయి.ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. లంగాణలో మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ఉంటుంది. 
 
హైదరాబాద్‌లో 14 చోట్ల కౌంటింగ్ ఉంటుంది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నచోట, ఎక్కువ టేబుళ్లు వేసి.. లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించారు. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,80,000 ఉన్నాయి. 
 
అందువల్ల ఈసారి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొంత ఎక్కువ సమయం కొనసాగే అవకాశం ఉంది.  అందువల్ల ఈవీఎంల లెక్కింపు కూడా కొంత ఆలస్యం కాగలదనీ.. తద్వారా ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందని అంచనా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు