ఈసారి స్వాతంత్ర దినోత్సవం వేళ లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో తమ సొంతూళ్లకో లేదా టూరిస్ట్ ప్లేస్‌లకో వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమైపోయారు. దీనికి తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ట్రావెల్స్ బుకింగ్స్ కు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఆగస్ట్ 17 నుంచి 19 వరకు వరుస సెలవలు రావడంతో ప్రయాణికులు టూర్లకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది రెడ్ బస్. గత వారంతో పోలిస్తే ఈ వారంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 29 శాతం అత్యధికంగా సీట్లు బుక్ అవుతున్నట్లు తెలిపింది రెడ్ బస్. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆర్టీసీ సర్వీసులు, అలాగే బస్ ఆపరేటర్లు కూడా దాదాపు 8000 వేలకు సర్వీసుల్ని సిద్ధంగా ఉంచుతున్నారు.
ప్రయాణికుల రద్దీ, వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్ బస్ కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికుల కోసం అత్యధిక సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం BIGBREAK అనే కూపన్ కోడ్‌ని సరికొత్త వినియోగదారులకు సిద్ధం చేసింది. దీనిద్వారా మొదటిసారి రెడ్ బస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు 24 శాతం డిస్కౌంట్‌తో రూ.500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే రెడ్ బస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులు BUS300 కూపన్ కోడ్ ఉపయోగించి ఆఫర్లను పొందవచ్చు.