శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఠాగూర్

శనివారం, 8 మార్చి 2025 (13:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న యువకుడు.. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని రామచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ (37) అనే అవివాహిత యువకుడుకి ఇటీవల ఓ యువతితో వివాహం నిశ్చమైంది. దీంతో శుక్రవారం రోజున ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించారు. శనివారం ఉదయం పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రాత్రికి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్న కాబోయే వధూవరులు.. రాత్రికి ఇంటికి వచ్చారు. వరుడు కిరణ్ రాత్రికి తన గదిలోనే నిద్రించాడు. ఇల్లంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఇంతలో పూజారి యువకుడుని పెళ్లి కుమారుడుని చేయాలని చెప్పడంతో కిరణ్‌ను నిద్రలేపేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
గదిలో కిరణ్ ఉరివేసుకుని కనిపించడమే ఇందుకు కారణం. వెంటనే కిరణ్‌ను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి కిరణ్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనతో వెళ్లింట విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మెట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు