తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నేతలను మోసగాళ్ళతో ఆయన పోల్చారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చ నెలకు యేడాది పూర్తవుతుందని ఆయన గుర్తుచేశారు. గత యేడాది జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలను కూడా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ఈ యేడాదికి ఇంకా 35 రోజులు మాత్రమే మిగిలివున్నాయని, ఈ హామీల అమలు ఎపుడంటూ ఆయన ప్రశ్నించారు. పైగా, మోసగాళ్లకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చేసిన పోస్ట్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు.
వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్
మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!
ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది -2 లక్షల జాబ్ లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు