పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

ఠాగూర్

సోమవారం, 21 ఏప్రియల్ 2025 (15:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితికి చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన కోర్టును తప్పుదారి పట్టించినట్టు నిర్ధారిస్తూ రూ.25 లక్షల అపరాధం విధించింది. ఈ సొమ్మును చెన్నమనేని రమేష్ సోమవారం చెల్లించారు. 
 
చెన్నమనేని పౌరసత్వంపై గతంలో కాంగ్రెస్ నేత, ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్ సుధీర్ఘకాలం న్యాయపోరాటం చేశారు. 
 
పలు ధపాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు న్యాయసేవాధికార సంస్థకు రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించగా, ఈ చెక్కులను చెన్నమనేని శ్రీనివాస్ సోమవారం హైకోర్టుకు అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు